![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -348 లో.. ముకుంద దగ్గరకి దేవ్ వస్తాడు. దేవ్ ని చూసి ముకుంద షాక్ అవుతుంది. ఏంటి ఏదో మాట వరుసకి అన్నాడని అనుకుంటే నిజంగానే వచ్చేసాడని ముకుంద మనసులో అనుకుంటుంది. దేవ్ ని భవాని, రేవతిలకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరిని ముకుంద పిలుస్తుంది. దేవ్ తన అన్నయ్య అంటూ పరిచయం చేస్తుంది.
మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. అప్పుడే దేవ్ ని ముకుంద తీసుకొని కృష్ణ, మురారి దగ్గరికి వస్తుంది. నేను నీకు రివర్స్ గా మాట్లాడితే నవ్వుతు తీసుకో, నాకు రివర్స్ అవ్వకు. ఏం చేసిన నీ గురించే అని అని ముకుందకి దేవ్ చెప్తాడు. ముకుంద దేవ్ ని లోపలికి తీసుకొని వచ్చి.. కృష్ణ మురారికి పరిచయం చేస్తుంది.. ఏంటి ఇప్పుడు ముకుంద, మురారీలకి పెళ్లి చెయ్యాలని వచ్చాడా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత నాకు ముకుంద ఎలాగో నువ్వు కూడా అంతే, ఇంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళకి ఎందుకు విడదియ్యలి అనుకుంటావా? వీళ్ళని ఎవరు విడదియ్యలేరని దేవ్ కన్నింగ్ గా మాట్లాడతాడు. దాంతో ముకుంద దేవ్ పై కోపంగా వెళ్లినట్టు వాళ్ళ ముందు నటిస్తుంది. మీరు అసలు నేరస్తులని వెతికే పనిలో ఉన్నారు కాదా.. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏమి అప్డేట్ ఉన్న నాకు చెప్పండి అని కృష్ణ, మురారిలతో దేవ్ అంటాడు. వాళ్ళు నిజంగానే దేవ్ హెల్ప్ చేస్తాడని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను మీకు హెల్ప్ చేస్తున్నట్లు ముకుందతో చెప్పకండని దేవ్ అంటాడు. ఆ తర్వాత దేవ్ బయటకు వచ్చి వాళ్ళు నమ్మేసారని అనుకుంటాడు.
మరొకవైపు ముకుందని రేవతి పిలిచి మాట్లాడుతుంది. మా అక్క మొత్తం నీ గురించి ఆలోచిస్తుంది. నువ్వు అన్యాయంగా వెళ్తున్నావ్. మా అక్క ని కూడా నీ దారిలో వెళ్లేలా చేస్తున్నావని ముకుందతో రేవతి అంటుంది. కానీ ముకుంద ఎప్పటిలాగే మురారి కావాలని అంటుంది. కృష్ణ క్యాంపు అని చెప్పి వెళ్ళిపోబోతుంటే మీరే కాదా తీసుకోని వచ్చారని ముకుంద అనగానే.. కానీ కృష్ణ వెళ్ళేది కాదని రేవతి అంటుంది. వెళ్తానని వెళ్ళింది కదా.. నేను అయితే మురారిని ఒక్క క్షణం కూడ వదిలి పెట్టి వెళ్ళనని ముకుంద చెప్తుంది. నాకు మురారి కచ్చితంగా కావాలని చెప్పి ముకుంద వెళ్లిపోతుంది. మరొకవైపు మురారిని కృష్ణ ఆటపట్టిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |